Hyderabad, మే 4 -- ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్య. ప్రశాంతంగా కూర్చోనివ్వదు. నిలబడనివ్వదు. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా మార్చి కుదుటగా ఉండనీయకుండా చేస్తుంది. అంతేకాదు, ఇది ఛాతీలో శబ్దం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. వృద్ధుల్లో చాలా మంది ఆస్తమా సమస్యతో శ్వాసకు ఇబ్బంది అయి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. దీనికి కారణం శ్వాసనాళాల వాపు, సంకోచం వల్ల కలిగే ఆస్తమా తీవ్రత మారుతూ ఉంటుంది. అయితే ఆస్తమా మీద చాలా మందికి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల చాలా మందికి అది అదృశ్యమై మళ్ళీ వస్తుందా అనే సందేహం ఎక్కువ మందిలో కనిపిస్తుంది.

ఇదే విషయంపై హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఇంటర్వ్యూలో, ఫోర్టిస్ హాస్పిటల్ వసంత కుంజ్‌లో సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ సక్సేనా మాట్లాడారు.

"ఆస్తమా ఉన్న చాలా మంది పిల్లలు తమ కౌమారదశ లేద...