Hyderabad, మే 21 -- ఆధునిక జీవిత శైలిలో ఏసి ఇంట్లో భాగంగా మారిపోయింది. పెరుగుతున్న వేడిని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎయిర్ కండిషనర్లను వాడుతున్నారు. అయితే ఆస్తమా ఉన్నవారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఎయిర్ కండిషనర్లలో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటారు. అలాగే ఏసీలలో ఉండడం వల్ల తమకు హానికరమా కాదా? అనే అనుమానం కూడా ఉంటుంది. వాటన్నింటికీ ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.

ఏసీని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎయిర్ కండిషనర్లు ఆస్తమా బాధితులకు అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఏసీలు ఇంట్లోని వాతావరణాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఏసీని 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచితే ఆస్తమా లక్షణాలు ప్రేరేపించే అవకాశం కూడా చాలా తక్కువ.

నాణ్యమైన ఫిల్టర్లతో కూడిన ఎయిర్ కండిషనర్లు వాడితే ఎంతో మంచిది. ఇవి ఇంట్లోని పుప్పొడి...