భారతదేశం, జూన్ 21 -- విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు సాధారణంగా అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా కెనడా వంటి దేశాలను ఎంచుకుంటారు. కానీ గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా సైతం ప్రపంచ విద్యా కేంద్రంగా దూసుకెళుతోంది. ఇది కేవలం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను మాత్రమే కాకుండా, అత్యాధునిక పరిశోధనలకు కూడా విస్తృత అవకాశాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ్​ టాప్​-50 లిస్ట్​లోని 6 ఆస్ట్రేలియా యూనివర్సిటీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆస్ట్రేలియాలోని బహుళ సాంస్కృతిక క్యాంపస్ వాతావరణం నుంచి లాభదాయకమైన పోస్ట్-స్టడీ వర్క్ అవకాశాల వరకు.. విద్యాపరమైన నైపుణ్యాన్ని శక్తివంతమైన, సురక్షితమైన, భవిష్యత్-ఆధారిత జీవనశైలిని కలిపి చూస్తున్న విద్యార్థులకు ఆస్ట్రేలియా ఒక గొప్ప ఎంపిక!

ఆసక్తికరంగా, అనేక ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలు.. "క్యూఎస్​ వరల్డ్ యూనివర్సిటీ ర...