భారతదేశం, జూలై 8 -- టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి ఆస్కార్ అవార్డు గెలిచిన ఎంఎం కీరవాణికి పితృవియోగం. ఆయన తండ్రి శివశక్తి దత్తా మరణించారు. 92 ఏళ్ల శివశక్తి దత్తా సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. దీంతో కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శివశక్తి దత్తా టాలీవుడ్ లో ఫేమస్ సాంగ్స్ రాశారు. దీంతో ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు శివశక్తి దత్తా సోదరుడు. రాజమహేంద్రవరం లోని కొవ్వూరులో 1932 అక్టోబర్ 8న శివశక్తి దత్తా జన్మించారు. చిన్నప్పటి నుంచి కలలపై ఆసక్తి ఉన్న ఆయన.. ఇంట్లో నుంచి ముంబయికి వెళ్లిపోయారు. ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. రెండ...