భారతదేశం, జనవరి 5 -- మరాఠీ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. దశావతార్ మూవీ 2026 ఆస్కార్ అవార్డుల రేసులో దూసుకెళ్తోంది. ఆస్కార్ కంటెన్షన్ లిస్ట్ లోకి ఎంటరైన తొలి మరాఠీ సినిమాగా 'దశావతార్' నిలిచింది. రాబోయే అకాడమీ అవార్డులకు ముందు 'దశావతార్' చిత్రం ఆస్కార్ పోటీ జాబితాలోకి ప్రవేశించడంతో, మహారాష్ట్ర సినిమా ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమైన మైలురాయిని అందుకుంది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరాఠీ మూవీ దశావతార్ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీ జీ5లో అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 12, 2025లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది.

సుబోధ్ ఖనోల్కర్ రచించి, దర్శకత్వం వహించిన 'దశావతార్' చిత్రంలో దిలీప్ ప్రభావల్కర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మహేష్ మంజ్రేకర్, భరత్ జాదవ్, సిద్ధార్థ్ మీనన్, ప...