భారతదేశం, నవంబర్ 12 -- 89 ఏళ్ల సీనియర్ నటుడు ధర్మేంద్ర బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు బుధవారం (నవంబర్ 12) ధృవీకరించారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో సహా కుటుంబ సభ్యులు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. బుధవారం ఉదయం ధర్మేంద్ర ఆరోగ్యంపై పీటీఐ ఈ అప్‌డేట్‌ను పంచుకుంది. కుటుంబం ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

89 ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని వారాలుగా పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. "ధర్మేంద్ర జీ ఉదయం 7.30 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇకపై చికిత్స ఇంటి వద్దే కొనసాగుతుంది" అని డాక్టర్ ప్రతీత్ సమదానీ పీటీఐకి తెలిపారు. ధర్మేంద్ర నివాసానికి అంబులెన్స్...