Telangana,asifabad, సెప్టెంబర్ 14 -- ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి మడుగులో పడి ఓ మహిళతో పాటు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊహించని ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రాథమిక వివరాల ప్రకారం. వాంకిడి మండలంలోని ధాబా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మోర్లే నిర్మలా భాయి ( 35) పొలం పనులకు వెళ్తూ తన కుమారుడితో పాటు మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లింది. ఇందులో కుమారుడు గన్ను(12) ఉండగా. మరో కుటుంబానికి చెందిన మహేశ్వరీ(8), శశికళ(10) ఉన్నారు.

సదరు మహిళ పత్తి పొలంలో యూరియాను పూర్తి చేసి. ఖాళీ సంచులను కడగడానికి సమీపంలో ప్రవహించే నీటి మడుగు వద్దకు చేరుకుంది. సంచులు శుభ్రం చేసే క్రమంలో. ఓ సంచి నీటిలో కొట్టుకుపోవడంతో పట్టుకోవడానికి ఆమె కుమారుడు గణేశ్‌ వెళ్లాడు. ఇంతలోనే అతను నీటిలో ...