Hyderabad, జూలై 17 -- జూలై, ఆగస్టు నెలల్లో ప్రధాన గ్రహాల కదలికలో మార్పు జరుగుతుంది. ఆషాడ మాసం, శ్రావణ మాసంలో ఈ ప్రధాన గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. ఆ తర్వాత జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ప్రేమ విలాసాలకు కారకుడైన శుక్రుడు జూలై 26న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఇదిలా ఉంటే జూలై 28న కుజుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 9న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఆషాడ, శ్రావణ మాసాలలో ప్రధాన గ్రహాల కదలిక జరుగుతుంది. దీంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు శుభ ఫలితాలను అందుకుంటారు, వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ప్రధాన గ్రహాల కదలికలో మార్పు రావడంతో కెరియర్, ఉద్యోగం, ప్రయాణాలలో ప్రత్...