Hyderabad, ఏప్రిల్ 23 -- విజయానికి వయసుతో సంబంధం లేదు. మంచి ఆలోచన, కష్టం, సంకల్పబలం ఇవి ఉంటే చాలు... ఏ వయసులోనైనా కూడా విజయం మీతో స్నేహం చేస్తుంది. అందుకు భీమ్‌రాజ్ శర్మ ఒక ఉదాహరణ. అతడు ఒక మధ్య తరగతి మనిషి. కూతురు పెళ్లి కోసం ముందు నుంచే కొంత కొంత డబ్బులు దాచుకుంటూ వచ్చాడు.

భీమ్‌రాజ్ వయసు యాబై ఏళ్ల పైనే. ఆ సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు అతి పెద్ద స్టార్టప్ గా మారి ఏడాదికి కోటి రూపాయల ఆదాయాన్ని ఇస్తోంది.

భీమ్‌రాజ్ శర్మది జైపూర్. 2014లో అతను ఏనుగు పేడతో కాగితపు షీట్లను తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టాడు. ఏనుగు పేడను సంపాదించడం చాలా కష్టం. ఇందుకోసం ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుంది. మధ్యతరగతి మనిషి ఏనుగు పేడను సేకరించలేకపోయాడు. అదే సమయంలో అతని కూతురు ఒక ప్రశ్న అడిగింది. 'ఏనుగు పేడ ఎందుకు? మన ఊర్లో బోలెడంత ఆవు పేడ దొరుకుతుందిగా...