భారతదేశం, డిసెంబర్ 29 -- రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉంటోంది. ఈ మూవీ మరో మైల్ స్టోన్ రీచ్ అయింది. ఆల్ టైమ్ టాప్ 10 ఇండియన్ సినిమాల్లో ధురంధర్ ఏడో ప్లేస్ కు చేరుకుంది. షారుక్ ఖాన్ పఠాన్ సినిమాను దాటేసింది ధురంధర్.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' బాక్స్ ఆఫీస్ వద్ద మరో శిఖరాన్ని అధిరోహించింది. డిసెంబర్ 28న దాని నాలుగో ఆదివారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1050 కోట్ల మార్కును దాటింది. రెండు పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అధిగమించి, అన్ని కాలాలలో 7వ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. కల్కి 2898 AD (రూ.1042 కోట్లు), షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ.1055 కోట్లు) రికార్డులను బ్రేక్ చేసింది.

ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 రోజుల్లో రూ.1064 కోట్ల కలెక్షన్ల...