భారతదేశం, జూన్ 19 -- ఆల్కహాల్ ఒక్క రాత్రి తాగినా అది మీ శరీరానికి చాలా హాని చేస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. జోసెఫ్ సల్హాబ్ హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా, విపరీతంగా మద్యం తాగడం వల్ల 'లీకీ గట్' (పేగుల నుండి రక్తం లీక్ అవ్వడం) సమస్య వస్తుందని, ఇది హానికరమైన విష పదార్థాలను రక్తంలోకి చేరవేస్తుందని ఆయన అంటున్నారు. మీరు అప్పుడప్పుడు తాగేవారైనప్పటికీ, ఆల్కహాల్ ప్రభావాలు 24 గంటల వరకు ఉంటాయి.

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేగులు, మూత్రపిండాల ఆరోగ్యం గురించి చిట్కాలు, వాస్తవాలను పంచుకుంటారు. జూన్ 18న ఆయన షేర్ చేసిన ఒక వీడియోలో, ఒక్క రాత్రి ఆల్కహాల్ తాగడం వల్ల ఎలా 'లీకీ గట్' ఏర్పడుతుందో, తద్వారా బ్యాక్టీరియా టాక్సిన్స్ రక్తంలోకి చేరి 24 గంటల పాటు మంటను కలిగిస్తాయో వివరించారు.

ఒక్క రాత్రి విపరీ...