Hyderabad, ఏప్రిల్ 18 -- ఆల్కహాల్ ఆధారిత అనారోగ్యాల సంఖ్య తక్కువేమీ కాదు. నిజానికి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే శక్తి మద్యానికి ఉంది. అందుకే మద్యం వినియోగం మానేయాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఆల్కహాల్ తాగే వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇక్కడ ఇచ్చాము.

మన శరీరంలో ప్రధాన అవయవాలైనా కాలేయం, గుండె, మెదడు... అన్నింటినీ ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది. జీర్ణవ్యవస్థ వ్యాధులను కూడా కలిగిస్తుంది. మానసిక సమస్యలైనా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి వాటికి కూడా అది కారణమవుతుంది. మద్యం అధికంగా సేవించడం వల్ల వచ్చే రోగాల జాబితా తెలుసుకుంటే మీరు దాన్ని తాగేందుకే భయపడతారు.

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా ప్రాణాంతకమైనది. ఇది కాలేయ మార్పిడికి కూడా కారణం అవుతుంది.

హ...