భారతదేశం, జనవరి 28 -- జీవితంలో మానవ సంబంధాలు విలువైనవి. ఆ బంధాలలో వైవాహిక బంధం చాలా ముఖ్యమైనది. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆలు మగల బంధం అహంభావాలకు అతీతంగా నిబంధనలు లేకుండా, నిస్వార్థంగా ఉండాలి. అలాంటి ప్రేమ అవగాహన, ఐక్యత, లోతైన అనుభూతిని పెంపొందించడం ద్వారా బంధాన్ని మరింత అందంగా మలుస్తుంది. ఇద్దరి బంధం దృఢంగా ఉండాలంటే ఈ 7 పసిడి సూత్రాలు పాటించాలి.

ప్రతి వ్యక్తి ఎదగడానికి వ్యక్తిగత స్పేస్ అవసరం. కానీ ఆ స్పేస్ ఎంతవరకు అనే అవగాహన ఉండాలి. అరవింద సమేత సినిమా లో హీరోయిన్ స్పేస్ కావాలి అని అంటూ ఉంటుంది.. అలా అనడం అవతలి వారిని దూరం పెట్టడం కాదు, ఎదుటి వారిని గౌరవిస్తూనే తన గౌరవాన్ని నిలుపుకోవడం. ఆ స్పేస్ అనేది లేకపోతే దంపతుల మధ్య పొరపొచ్చాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

వివాహం బంధం ఇద్దరు వ్యక్తుల శరీరాలు, మనస్సుల కలయిక. బంధంలో మిమ్మల్ని మీరు గుర...