భారతదేశం, జనవరి 27 -- ఆంధ్రప్రదేశ్‌లో ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రంలో మొట్టమొదటి ఆలయ పర్యాటక కారవాన్‌ను ప్రారంభించారు. ఇది యాత్రికులకు ఆధునిక ప్రయాణ, వసతి సౌకర్యాలను అందిస్తుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా తయారుచేసిన ఈ కారవాన్‌ను ప్రారంభించారు మంత్రి. వాహనాన్ని పరిశీలించి దాని ఫీచర్లు, కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో సంభాషించారు.

మీడియాతో మాట్లాడిన రామనారాయణ రెడ్డి.. ఈ చొరవ భక్తులకు సౌకర్యవంతమైన, సుసంపన్నమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో కారవాన్‌ను అభివృద్ధి చేసినందుకు నెల్లూరుకు చెందిన వై.శ్రీనివాస రెడ్డిని ప్రశంసించారు. ప్రైవేట్ భాగస్వాముల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కారవాన్‌లను ప్రవేశపెడతామని మంత్రి పేర్కొన్నారు. దీ...