భారతదేశం, నవంబర్ 5 -- టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి.. ఏడాది అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల్లో భక్తి భావన పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ చెప్పారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని వివరించారు. ఎయిర్‌పోర్టును ఆలయం సెట్ మాదిరిగానే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు.

'భక్తులకు ఇబ్బంది లేకుండా.. నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నాం. రోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులు అన్న ప్రాసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కూడా మార్పులు వచ్చాయి. పది రోజులైనా నిల్వ ఉంటున్నాయి. ఈ విషయాన్ని భక్తులే చెబుతున్నారు. తిరుపతి లోకల్ వాళ్లకు నెలకోసారి తొలి మంగళవార...