Hyderabad, జూన్ 25 -- ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కాసేపు ఆలయంలో కూర్చుకుంటే మనసు తేలికపడుతుంది. ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే భగవంతునికి నైవేద్యాలు సమర్పించాలన్నా, ఆలయ హారతి చూడాలన్నా అన్నీ మనస్ఫూర్తిగా చేస్తాం. ఆలయం లోపల మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది, దీని వల్ల ప్రతికూల శక్తి అంతా క్షణాల్లో మాయమవుతుంది.

అదే సమయంలో ఆలయం నుంచి తిరిగివచ్చే సమయంలో తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. కనుక మనం ఈ తప్పులు చేయకుండా ఉండాలి. మరి ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

తరచుగా మనం గుడిలో పూజలు చేసి తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రవేశద్వారం వద్ద గంట మోగిస్తాం. అలా చేయడం సరికాదు. ప్రవేశ సమయంలో గంట మోగించడం వల్ల మన జీవితంలో పాజిటివ్ ఎన...