భారతదేశం, డిసెంబర్ 22 -- అద్భుతాలు జరిగే వరకూ ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదనేది ఓ సినిమా డైలాగ్. అలాంటి అద్భుతమే పడాల కల్యాణ్. అవును.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో, బయట ఎక్కడ విన్నా ఇదే మాట. బిగ్ బాస్ 9 తెలుగు లో కామనర్ గా అడుగుపెట్టి విన్నర్ గా నిలిచిన పడాల కల్యాణ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.

ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ బిగ్ బాస్ 9 విన్నర్ గా నిలిచాడు. సగర్వంగా ట్రోఫీ అందుకున్నాడు. తనూజ పుట్టస్వామిని దాటి విజేతగా తల ఎత్తుకున్నాడు. ఈ గెలుసు సాధారణమైంది కాదు. ఈ విజయం ఊరికే రాలేదు. అందుకే కల్యాణ్ గెలిస్తే తాము గెలిచినట్లు చాలా మంది జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కల్యాణ్ విజయాన్ని తమ గెలుపుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ గా నిలిచిన పడాల కల్యాణ్ కొన్ని రికార్...