భారతదేశం, డిసెంబర్ 15 -- బిగ్ బాస్ 9 తెలుగులో క్లైమాక్స్ కు రంగం సిద్ధమైంది. 15 వారాల ఈ రియాలిటీ షో సీజన్ లో అత్యంత కీలకమైన చివరి వారం వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో మిగిలింది ఒక్క వారమే. ఈ నేపథ్యంలో ఫైనల్ చేరిన టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోయింది. పడాల కల్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, సంజన గల్రానీ బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలేకి అర్హత సాధించారు.

బిగ్ బాస్ 9 తెలుగులో గత వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సుమన్ శెట్టి శనివారం, భరణి శంకర్ ఆదివారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. దీంతో హౌస్ లో అయిదుగురు మిగిలారు. కల్యాణ్, తనూజ, సంజన, ఇమ్మాన్యుయెల్, పవన్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. ఇక టైటిల్ రేసులో ఉన్న ఈ అయిదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారో అనే ఉత్కంఠ మొదలైంది.

బిగ్ బాస్ ప్రైజ్ మనీని హోస్ట్ నాగార్జున ప్రకటించేశారు. ఈ 9వ స...