భారతదేశం, నవంబర్ 4 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా ఆర్టీసీ ప్రయాణంపైనా కూడా జనాలకు భయం పట్టుకుంది. నిజానికి ఆ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ది తప్పు లేకపోయినా.. లెక్కకు మించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంపైనా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఓవర్‌లోడ్ ప్యాసింజర్లు ఉన్నా.. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

ఉదయం కాలేజీ టైమ్‌లో ఏ టౌన్‌లో చూసినా బస్సుల్లో ప్రయాణికులు లెక్కకు మించే కనిపిస్తారు. పల్లెటూర్ల నుంచి బస్సులు తక్కువగా ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తుంది. కాలేజీ విద్యార్థులు, పనుల మీద పట్టణాలకు వచ్చే జనాలతో ఆర్టీసీ బస్సుసు కిక్కిరిసిపోతున్నాయి. ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఇది ప్రధాన కారణం.

ఓవర్‌లోడ్ పరిమితి అనేది దైనికైనా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల కెపాసిటీ...