భారతదేశం, నవంబర్ 3 -- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సుపై పడింది. ఈ ఘటనతో బస్సులోని చాలా మంది ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది మరణించారు. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్‌ బస్సు వెళ్తోంది. ఈ సమయంలో కంకర లారీ ఢీ కొట్టి బస్సు మీద పడిపోయింది. లారీలో ఉన్న కంకర పడడంతో బస్సులో కూరుకుపోయారు ప్రయాణికులు. ఘటన సమయంలో వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. జేసీబీ తెప్పించి తొలగించారు. ఈ ఘటనలో 17 మంది మరణించారు. చాలా మందికి గాయాలు అయ్యాయి.

ఈ ఘటనలో బస్సు, లారీ డ్రైవర్ కూ...