భారతదేశం, మే 5 -- తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై కార్మిక సంఘం నేతలు మంత్రి పొన్నంతో సమావేశం అయ్యారు. పదేళ్లుగా తెలంగాణలో ఆర్టీసీ నిర్లక్ష్యంగా చేశారని తమ ప్రభుత్వం ఆర్టీసీ వ్యవహారాలను గాడిలో పెడుతోందని కార్మిక సంఘాలకు పొన్నం వివరించారు.

తెలంగాణలో ఆర్టీసీ కోలుకుంటున్న దశలో కార్మికులు సమ్మెకు దిగితే సంస్థకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ కార్మిక నేతలకు సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రి పొన్నంతో భేటీ అయ్యారు.

కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన నేతలతో మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యలు వినడానికి సీఎం, తాను సిద్ధంగా ఉం...