భారతదేశం, డిసెంబర్ 26 -- మెడికల్‌ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో. ఆర్టీసీ విలీనం తర్వాత (2020 జనవరి 1) మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి కలగనుంది.

విలీనానికి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఉండేవి. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు సహా ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.

కార్పొరేషన్‌లో ఉండగా 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలు కల్పించేవారు. విలీనం తర్వాతా 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్‌ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దక్కుతాయి. మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్ ఉద్యోగాలు ఇవ్వ...