భారతదేశం, మే 23 -- లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే పోక్సో చట్టానికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు లభించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా తీర్పు వెలువరించింది. నిందితుడు పోక్సో చట్టం కింద దోషిగా తేలినప్పటికీ, బాధితురాలి విషయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దోషికి శిక్ష విధించడం లేదని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అనంతరం, సమాజం ఆమెను జడ్జ్ చేస...