Hyderabad, ఆగస్టు 9 -- వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది దర్శకులు, నటీనటులు శివ మూవీని ఐకానిక్ ఫిల్మ్‌గా ఇప్పటికీ భావిస్తారు. ఎంతోమంది డైరెక్టర్స్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చిన సినిమా శివ. అలాంటి శివ రీ రిలీజ్ కానుంది.

సుమారు 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ శివ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ విషయాన్ని తాజాగా హీరో నాగార్జున సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నాగార్జున నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వేడుకల్లో భాగంగా శివతో సహా అన్నపూర్ణ గత చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు.

శుక్రవారం ఆగస్ట్ (8) ఎక్స్ (గతంలో ట్విటర్)లో నాగార్జున శివ రీ రిలీజ్ చేస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశారు. అందులో "హలో మై ఫ్రెండ్స్! అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం శివ రీ రిలీజ్ కానుంది. ఇప్పటికీ రాని 4కె డ...