భారతదేశం, జనవరి 7 -- రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. కలెక్షన్ల మోత మోగిస్తున్న ఈ మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది.

దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద ధురంధర్ మరో మైలురాయిని అధిగమించింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ను అధిగమించి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగా నిలిచింది. బుధవారం (జనవరి 7) నాటికి రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ఇండియన్ కలెక్షన్లు రూ.786 కోట్లకు చేరాయి. దీంతో ఆర్ఆర్ఆర్ రూ.782 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది.

ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ధురంధర్ నాలుగో ప్లేస్ కు చేరుకుంది. ఈ స్పై యాక్షన్ థ్...