భారతదేశం, జనవరి 29 -- దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక అమానవీయ ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఆరేళ్ల వయసున్న ఒక పసి ప్రాణంపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడటం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఈ దారుణ ఉదంతంపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు.

బుధవారం (జనవరి 28) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఘటనకు సంబంధించిన వార్తను షేర్ చేస్తూ భూమి పెడ్నేకర్ తన ఆవేదనను వెళ్లగక్కారు. "అసలు ఏం జరుగుతోంది? లైంగిక వేధింపులకు పాల్పడినా సులభంగా తప్పించుకోవచ్చని భావిస్తున్న ఇలాంటి రాక్షసుల్లో భయాన్ని కలిగించలేకపోతున్నామంటే.. మనం కచ్చితంగా విఫలమైనట్టే" అని భూమి ఘాటుగా విమర్శించారు. నేరస్థుల్లో చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు పునరావృతమవుతున్నాయని ఆమె అభిప్రాయప...