Hyderabad, మే 7 -- కొన్నేళ్లుగా బాలీవుడ్ వెనుకబడిపోతోంది. తెలుగుతోపాటు మిగిలిన సౌత్ ఇండియా ఇండస్ట్రీల నుంచి బ్లాక్‌బస్టర్ హిట్స్ వస్తుండగా.. హిందీ సినిమా మాత్రం ఫ్లాపవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ దీనిపై స్పందించాడు. ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు రావడం లేదో అతడు చెప్పాడు. సౌత్ ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉందని అన్నాడు.

ఆమిర్ ఖాన్ తాజాగా ఏబీపీ న్యూస్ తో మాట్లాడాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎలా హిందీ సినిమాను వెనక్కి నెడుతున్నాయో ఈ సందర్భంగా అతడు చెప్పాడు. దీని వెనుక కారణమేంటో అతడు వివరించాడు. "ముందుగా మనం మంచి సినిమాలు తీయాలి.

హిందీ సినిమా డైరెక్టర్లు, రైటర్లు, ప్రొడ్యూసర్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అంతేకాదు ప్రస్తుతం మన బిజినెస్ మోడల్ కూడా వింతగా ఉంది. థియేటర్లకు రావాలని ప్రేక్షకులను పిలుస్తాం. ఒ...