భారతదేశం, డిసెంబర్ 5 -- తెలుగు ప్రేక్షకులకు 'కొత్త బంగారు లోకం'లో అమాయకమైన పాత్రతో దగ్గరైన శ్వేతా బసు ప్రసాద్.. ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఈ ఒక్క ఏడాదే ఆమె నటించిన 'ఊప్స్.. అబ్ క్యా?', 'క్రిమినల్ జస్టిస్', తాజాగా సోనీ లివ్‌లో విడుదలైన 'మహారాణి సీజన్ 4' ప్రేక్షకులను అలరించాయి. చేతి నిండా పని ఉన్నప్పటికీ, తాను ఎంచుకునే పాత్రల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటానని ఆమె హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పింది.

కథల ఎంపికలో తాను ఎంత నిక్కచ్చిగా ఉంటానో శ్వేతా బసు ప్రసాద్ వివరించింది. "నేను వరుసగా నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ నేను చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాను. అందుకే ప్రేక్షకులు నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నాకు ముఖ్యం. భవిష్యత్తులో నా సెలెక్షన్స్ తప్పవచ్చు.. అప్పుడు వాటి నుంచి నేర్చుకుంటాను" అని ఆమె చెప్ప...