భారతదేశం, డిసెంబర్ 4 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 26 కంపెనీలకు చెందిన రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఎనర్జీ, ఐటీ, ఐ అండ్ ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 20,444 కోట్ల విలువైన పెట్టు...