భారతదేశం, డిసెంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురాతన భారతీయ వైద్య విధానాన్ని ఆధునిక వైద్య విధానంతో అనుసంధానించాలని నిర్ణయించింది. శస్త్రచికిత్సలో సరైన శిక్షణ పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు స్వతంత్రంగా ఆపరేషన్లు చేపట్టడానికి ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్, 2020, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయుర్వేద వైద్యులకు ఆరోగ్య మంత్రి తన సమ్మతిని తెలిపారు.

ఈ నిర్ణయంతో అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు 39 శాతం జనరల్ సర్జరీ, 19 శాతం ENT (చెవి, ముక్కు, గొంతు), నేత్ర చికిత్సలు చేయవచ్చు. వీటిలో అంటు వ్యాధుల చికిత్సలు, గాయాలను కుట్టడం, పైల్స్, పగుళ్లు, చర్మ అంటుకట్టుట, ఇతర చికిత్సలు ఉన్నాయి. దీనికి సంబంధించి విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే ...