భారతదేశం, అక్టోబర్ 14 -- మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు విడిచిపెట్టారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మల్లోజుల పార్టీని వీడుతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన పేరిట లేఖలు కూడా బయటకు వచ్చాయి.

గత వారం మల్లోజుల పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలో కలవాలని, తమను తాము రక్షించుకోవాలని, అర్థరహిత త్యాగాలు చేయవద్దని కార్యకర్తలకు ఆయన ఒక లేఖలో పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇకపై సాయుధ పోరాటాన్ని కొనసాగించలేనని సోను తన సహచరులకు లేఖలో చెప్పారు.

మావోయిస్టులు అనుసరించిన మార్గం పూర...