Hyderabad, ఆగస్టు 11 -- యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ డెబ్యూ మూవీ వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 14న మూవీ రిలీజ్ సందర్భంగా ఆదివారం (ఆగస్ట్ 10) నిర్వహించిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "అభిమానులతో ఇలా కలిసి సెలెబ్రేట్ చేసుకునేలా చేసిన మా వంశీకి థాంక్స్. బాద్ షా ఫంక్షన్‌లో వరంగల్‌కు చెందిన అభిమాని చనిపోయారు. అప్పటి నుంచి ఇలా పబ్లిక్ ఫంక్షన్‌లకు కాస్త దూరంగా ఉంటూ వచ్చాను. నా 25 ఏళ్ల సినీ జర్నీని సెలెబ్రేట్ చేయాలని నన్ను ఫోర్స్ చేసిన వంశీకి, వంశీని ఫోర్స్ చేసిన అభిమానులకు థాంక్స్" అని అన్నాడు.

"'వార్ 2' చేయడానికి ప్రధానం కారణం ఆదిత్య చోప్రా. 'వార్ 2' చేయా...