భారతదేశం, డిసెంబర్ 1 -- బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్‌తో ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు హోస్ట్‌గా హీరో శివాజీ వ్యవహరిస్తున్నాడు.

అయితే, ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది పన్నెండో వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ దివ్య నిఖిత. బిగ్ బాస్ బజ్‌కు దివ్య నిఖిత రాగానే హోస్ట్ శివాజీ వెల్‌కమ్ చెప్పాడు. "దివ్య నిఖిత లాంటి ఒక స్ట్రాంగ్ మనిషి.. ఇన్ని సీజన్స్ చూసినప్పుడు భరణి ఎందుకు. తనూజతో ఎలా ఉంటే మనకేంటమ్మ అసలు.." అని శివాజీ అడిగాడు.

"అది నాకు ఎప్పుడు ముందు" అని దివ్య చెబుతుండగానే.. మధ్యలో "కానీ మీ పొసెసివ్‌నెస్ తెలిసిపోతుంది తల్లి" అని శివాజీ అన్నాడు. దానికి దివ్య నవ్వింది. "ఇప్పుడు నీ ఒపినీయన్ ఏంటమ్మా తనూజ మీద" అని ...