భారతదేశం, డిసెంబర్ 31 -- టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. దీంతో చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్‌కు మంచి హిట్ దక్కినట్లు అయింది. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 29) నాడు శంబాల విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "'శంబాల' సినిమాని యుగంధర్ ముని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం ఉంది. 'శంబాల' ట్రైలర్ చూసిన వెంటనే ఆదికి బన్నీ (అల్లు అర్జు...