భారతదేశం, జనవరి 6 -- అదొక నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం. అక్కడ ఒక మహిళ మృతదేహం పడి ఉంది. ఆమె తలను పెద్ద బండరాయితో మోది కిరాతకంగా చంపేశారు. ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసుల ముందున్నది ఒక 'బ్లైండ్ కేస్' (Blind Case). కానీ, కేవలం ఒక ఆమ్లెట్ ముక్క ఆ కేసులో ఎలా టర్నింగ్ పాయింట్‌గా మారిందో తెలుసా? మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించిన ఈ హత్యోదంతం ఆసక్తికరంగా ఉంది.

డిసెంబర్ 29న గ్వాలియర్ శివారులోని గోలా కా మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులకు మృతదేహం పక్కనే ఒక చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది. ఎస్ఎస్పీ ధర్మవీర్ సింగ్ ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. "ముందుగా ఆ ఆమ్లెట్ ఎక్కడిదో ఆరా తీశాం. ఘటనా స్థలానికి సుమారు 200 మీటర్ల పరిధిలోని అన్ని ఫుడ్ స్టాల్స్‌ను ...