Hyderabad, ఏప్రిల్ 19 -- మిస్ ఇండియా పోటీలకు వెళ్లడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎన్నో వడపోతల తర్వాత ఆ స్థాయికి చేరుకుంటారు. అలాంటి మిస్ ఇండియా ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది ఐశ్వర్య షెయరాన్. ఆమె అనుకుంటే బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా మారిపోవచ్చు. కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఆమె రక్తంలో దేశానికి సేవ చేయాలని కాంక్ష ఉంది. ముఖ్యంగా సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించాలన్న లక్ష్యం పెట్టుకుంది.

అదే లక్ష్యంతో గ్లామర్ రంగాన్ని వదిలేసింది. ఎన్ని అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. చివరికి తాను అనుకున్నది సాధించి పెద్ద ప్రభుత్వం ఉద్యోగం చేస్తోంది.

ఐశ్వర్య జీవితం ఒకప్పుడు వేరు. ఒకప్పుడు బికినీలలో గ్లామరస్ గా కనిపిస్తూ ఫోటోషూట్లలో పాల్గొనేది. ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయినా ఆమెకు మనసులో సివిల్స్ ర్యాంక్ సాధించాలన...