Hyderabad, ఆగస్టు 1 -- క్రికెటర్ యుజ్వేంద్ర చహల్.. ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత ఆర్.జె. మహ్వష్‌తో డేటింగ్ చేస్తున్నాడని గత కొన్ని నెలలుగా పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్ల మీద చహల్ ఇప్పుడు నోరు విప్పాడు. మహ్వష్‌ను తన ఇంట్లో చిచ్చు పెట్టిన వ్యక్తి అని అనడంపై అతడు మండిపడ్డాడు. అయితే తమ రిలేషన్షిప్ గురించి మాత్రం అతడు ఏమీ చెప్పలేదు.

రాజ్ షమాని పోడ్‌కాస్ట్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తన డేటింగ్ పుకార్ల గురించి మాట్లాడాడు. మహ్వష్‌తో లేదా మరెవరితోనైనా ఏదైనా జరుగుతోందా అని అడిగినప్పుడు చహల్ స్పందిస్తూ.. "లేదు, ఏమీ లేదు. ఎవరు ఏమైనా అనుకోవచ్చు" అని స్పష్టం చేశాడు. తన గత బంధం నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుందని, ముందు తాను స్థిరపడాలని చెప్పాడు.

దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో తాను, మహ్వష్ కలిసి ఉన్న వైరల్ ఫోటో గురించి కూడా...