భారతదేశం, మే 14 -- బాలీవుడ్ స్టార్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న సితారే జమీన్ పర్ చిత్రంపై చాలా క్యూరియాసిటీ నెలకొంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమిర్ సినిమా వస్తుండటంతో హైప్ బాగా ఉంది. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్నారు. సితారే జమీన్ పర్ సినిమా ట్రైలర్ తాజాగా వచ్చింది. అయితే, ఈ ట్రైలర్‌పై ట్రోలింగ్ వస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

సితార్ జమీన్ పర్ చిత్రం స్పానిష్ మూవీ ఛాంపియన్స్ (2018)కు కాపీలా ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీ హాలీవుడ్‍లోనూ ఛాంపియన్స్ పేరుతో రీమేక్ అయింది. మానసిక స్థితి సరిగా లేని కొందరికి ఓ వ్యక్తి బాస్కెట్ బాల్‍ కోచ్ కోచింగ్ ఇవ్వాల్సి రావడం, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు, వారి జీవితాలు ఎలా మారాయన్న విషయాల చుట్టూ (ఛాంపియన్స్ మూవీ ఉంటుంది.

సితారే జమీన...