Hyderabad, ఏప్రిల్ 25 -- మనిషి జీవన వికాసం అంతర్గత, బాహ్య శరీర నిర్మాణం మరియు జీవ మానసిక ప్రక్రియ అనే మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. డెవలప్‌మెంట్ సైకాలజీలోని "అభివృద్ధి మరియు వికాసము" అనే సిద్ధాంతం ఈ అంశాన్ని సవివరంగా తెలియజేస్తుంది. ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే పరికరం కంప్యూటర్. మానవ శరీర నిర్మాణంలోని ప్రధాన భాగమైన మెదడు నిర్మాణం మరియు పనితీరు కంప్యూటర్‌తో సారూప్యతను కలిగి ఉంటాయి. మానవ మెదడుకు మరియు ఆధునిక కంప్యూటర్‌కు నిర్మాణంలో, పనితీరులో పోలిక ఉంది. దాని గురించే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కంప్యూటర్‌లో రాండమ్ యాక్సెస్ మెమరీ (RAM) యొక్క శక్తిసామర్థ్యంపై కంప్యూటర్ పనితీరు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం ఆ సామర్థ్యం కేవలం మెగాబైట్లలో (MB) ఉండేది. దానితోపాటు మరో ముఖ్యమైన నిక్షిప్త సామర్థ్యం హ...