Hyderabad, ఏప్రిల్ 16 -- ఆపిల్ హల్వా ఒక సూపర్ టేస్టీ డెజర్ట్. దీన్ని వండడం చాలా సులువు. ఇంట్లో విందులు వినోదాల సమయంలో ఆపిల్ హల్వా సింపుల్ గా వండేయచ్చు. మీ పిల్లల పుట్టినరోజు సమయంలో కూడా దీన్ని మీరు తయారుచేయవచ్చు. దీన్ని పంచదార, ఆపిల్ ప్యూరీతో చేస్తారు. నెయ్యి వేసి చేసే ఈ హల్వా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. ఆపిల్ హల్వా ఎలా చేయాలో తెలుసుకోండి.

ఆపిల్ పండు - ఒకటి

పంచదార - ఒక కప్పు

యాలకుల పొడి - అర స్పూను

నెయ్యి - అర కప్పు

జీడిపప్పులు - పది

బాదం పప్పులు - అయిదు

ఎండు ద్రాక్షలు - గుప్పెడు

1. ఆపిల్ ను శుభ్రంగా కడిగి తుడిచి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. కట్ చేసిన వెంటనే రంగు మారకుండా నీటిలో వేయాలి.

3. ఆ నీటిలో ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. లేదా సాధారణ నీటిలా తీసుకోవచ్చు.

4. ఆపిల్ ను మిక్సీ జార్ లో వేసి...