భారతదేశం, మే 30 -- ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల నుంచి పెద్ద సంఖ్యలో పాస్ వర్డ్లు, సున్నితమైన డేటా లీక్ అయినట్లుగా తాజాగా కనుగొన్నారు. ఆన్ లైన్ లో ఇమెయిల్ చిరునామాలు, ఆథరైజేషన్ లింక్ లతో పాటు 18.4 కోట్లకు పైగా పాస్ వర్డ్ లతో కూడిన అన్ సెక్యూర్డ్ డేటాబేస్ ను సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జెరెమియా ఫౌలర్ కనుగొన్నారు. ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి ప్రముఖ సేవలకు సంబంధించిన సమాచారం లీకైంది.

బహిర్గతమైన డేటా కేవలం పాస్ వర్డ్ లకు మాత్రమే పరిమితం కాలేదు. లీక్ అయిన డేటాలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ వివరాలు ఉంటాయి. ఎన్క్రిప్షన్ ద్వారా అటువంటి సమాచారాన్ని రక్షించే సాధారణ డేటాబేస్ ల మాదిరిగా కాకుండా, ఈ డేటాబేస్ సాదా టెక్స్ట్ ఫైల్ గా స్టోర్ అయిఉంది. ఇది ఆన్ లైన్లో ఎవరికైనా సు...