భారతదేశం, మే 11 -- భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ దుస్సాహసానికి దీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనలో కొత్త పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించాయి.

మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఛానల్ ద్వారా మాత్రమే భారత్ పాకిస్థాన్‌తో మాట్లాడుతుందని, చర్చించడానికి మరో విధానం లేదని ఆ వర్గాలు తెలిపాయి. సింధూ నదీ జలాల ఒప్పందం.. సీమాంతర ఉగ్రవాదంతో ముడిపడి ఉందని ఓ అధికారి తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం కొనసాగినంత కాలం ఈ ఒప్పందం రద్దవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ...