భారతదేశం, మే 10 -- పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాకిస్థాన్‍పై ఆపరేషన్ సిందూర్ చేపట్టాయి భారత సాయుధ దళాలు. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. పాకిస్థాన్‍తో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ డ్రోన్లను, క్షిపణును ప్రయోగిస్తూ కవ్విస్తోంది. భారత్ దీటుగా ఎదుర్కొంటూ పాక్‍ను దెబ్బకొడుతూనే ఉంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు సాగుతున్నాయి. ఈ తరుణంలో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో సినిమా అనౌన్స్ అయింది.

ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రానున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయింది. ఈ పోస్టర్లో.. ఓ మహిళా సైనికురాలు ఓ చేతిలో గన్ పట్టుకొని ఉండగా.. మరో చేత్తో నిదుటిపై పెటుకుంటున్నారు. ముఖాన్ని మేకర్స్ రివీల్ చేయలేదు. ఆ సైనికురాలి ముందు యుద్ధ ట్యాంకర్లు, రగుతున్న మంటలు ఉన్నాయి. యుద్ధరంగంలోకి దిగే ముందు సై...