భారతదేశం, జూలై 28 -- జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ముగ్గురు ఉగ్రవాదులలో పహల్గామ్ దాడికి సూత్రధారి అయిన ముసా కూడా ఉన్నాడు. ఈ ఎన్‌కౌంటర్ జ్వర్వాన్ రిడ్జ్ మరియు మహాదేవ్ రిడ్జ్ మధ్య ప్రాంతంలో జరిగింది.

ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూకాశ్మర్‌ పోలీసులు, భారతసైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఎప్పటినుంచో సమాచారం ఉంది. మరోవైపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆర్మీ ఏరియా డామినేషన్ పార్టీ సాధారణ గస్తీలో ఉన్నప్పుడు ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను చూసింది. వారు భద్రతా బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. దీని తరువాత ఎన్‌కౌంటర్ ప్ర...