భారతదేశం, మే 18 -- ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 20 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మే 16 నుంచి 17 వరకు వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ తో పాటు వాహనాల తనిఖీలు చేపట్టారు. పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో.. ఒక డివిజన్ కమిటీ సభ్యుడితో పాటు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులతో సహా పలువురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇటీవల పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కర్రెగుట్టలో ...