భారతదేశం, మే 7 -- పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలకు అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్‌ ప్రకటించారు.

భారతీయ పౌరులుగా మన సాయుధ దళాలకు అండగా నిలవాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద కర్మాగారాలపై దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయని ఇది జాతి మొత్తం సంఘీభావాన్ని , ఐక్యతను నిరూపించాల్సిన సమయమని, మనమందరం ఒకే గొంతుతో మాట్లాడదాం - జై హింద్!" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఉగ్రవాదం పట్ల ప్రపంచం జీరో టాలరెన్స్ చూపించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.

పాకిస్తాన్ భూభాగంత పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న...