Hyderabad, ఫిబ్రవరి 6 -- ఆసుపత్రికి ఏదో ఒక సమయంలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ప్రతి సమస్యకు వైద్యుల సహాయం అవసరం. అందుకే ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావిస్తారు. అయితే ఆస్పత్రికి వెళ్లిన తర్వాత ఆపరేషన్ థియేటర్ కు వెళ్లినప్పుడు డాక్టర్లంతా నీలం, ఆకుపచ్చ రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. అలా ఆ రెండు రంగులే ఎందుకు ధరిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోండి.

ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఆకుపచ్చ లేదా నీలం రంగు యూనిఫామ్ వేసుకుని కనిపిస్తారు. దానికి సరైన కారణం ఉంది. ఆపరేషన్ థియేటర్ చీకటిగా ఉంటుంది.వెలుగు నుండి చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు ఆకుపచ్చ లేదా నీలం రంగులు మంచి అనుభూతిని ఇస్తాయి. అందుకే ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఈ రెండు రంగులే ధరిస్తారు.

ఆకుపచ్చ, నీలం కాంతి వర్ణపటంలో ఎరుపు రంగుక...