భారతదేశం, అక్టోబర్ 7 -- బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌ ఎంతో ప్రేమగా ఉంటారు. వీళ్ల మధ్య ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ అయినా కెమిస్ట్రీ అదరిపోతుంది. మరోసారి ఈ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అబుదాబి టూరిజం ప్రమోషనల్ యాడ్ కోసం ఈ జంట స్క్రీన్‌పై తిరిగి కలిసింది. దీపికా రణ్‌వీర్‌ను 'మ్యూజియం-వర్తి' కళాఖండం అని పిలవకుండా ఉండలేకపోయింది. వారి సరదా కెమిస్ట్రీకి అభిమానులు ముగ్ధులయ్యారు. దీపికా పదుకొణె రణ్‌వీర్ సింగ్‌ను ఆటపట్టించింది.

ఎక్స్‌పీరియన్స్ అబుదాబి.. దీపికా పదుకొణెను ఎమిరేట్ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌వీర్ సింగ్‌తో చేరినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనలో రణ్‌వీర్ ఒక మ్యూజియంలో ఒక కళాఖండాన్ని చూస్తూ.. ''క్రీ.శ. 90లో ఇంతటి స్థాయి వివరాలు ఉంటాయని ఊహించగలరా? నా విగ్రహం చేస్తే నా భంగిమ ఎలా ఉంటుందో అని నేన...