భారతదేశం, ఆగస్టు 6 -- ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్ లింక్డ్ పీఎంఎల్ఏ కేసులో ఈడీ విచారణ వేగం పుంజుకుంది. ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇవాళ (ఆగస్టు 6) టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యాడు. బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ అధికారులను కలిశాడు.

కొన్ని అంతర్జాల వేదికల ద్వారా చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ బెట్టింగ్, జూదానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు. ఈ 'లైగర్' హీరో హైదరాబాద్ లోని ఈడీ జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ను జూలై 30న ఈడీ అధికారులు విచారించారు. వీళ్లే కాకుండా రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు తదితర సెలబ్రిటీలను కూడా ఈడీ విచారణకు పిలిచింది.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ నటీ...