Hyderabad, జూలై 10 -- అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం 29 మంది ప్రముఖ నటీనటులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది.

హీరోలు-హీరోయిన్స్

వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నటుడు ప్రకాష్ రాజ్, హీరోయిన్స్ నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, టీవీ యాంకర్స్ శ్రీముఖి, శ్యామల (వైకాపా అధికార ప్రతినిధి), యూట్యూబర్స్ హర్షసాయి, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, సుప్రీతతోపాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నట్లు సమాచారం.

వీరితోపాటు వర్షిణి సౌందరరాజన్, బిగ్ బాస్ ముద్దుగుమ్మలు వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, సిరి హన్మంతు, నయని పావని, అమృతా చౌదరి, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, టేస్...